లలిత శేఖర సంభాషణలు - 1

చేతిలో అట్లకాడతో, వంటగది నుండి వస్తూ… గుమ్మం దగ్గర నిల్చొని… “కేవలం దంపతుల మధ్య సంభాషణల ద్వారా, వాళ్ళ అన్యోన్యత ఎలా తెలుస్తుందోయ్” అంటూ తిరిగి ప్రశ్నించాడు శేఖరం…

కూతుర్కి జుట్టు సరిచేస్తున్న లలిత…. “ఏం లేదండీ…. ప్రకటించని భావాలను అర్ధం చేసుకోగల్గడం… ప్రకటించిన భావాలను చెవిన పెట్టడం… ప్రకటించాల్సిన భావాలను సునాయాసంగా ప్రకటించ గల్గడం… ప్రకటించని భావాల వల్ల ఎదురైన ఇబ్బందులను ప్రకటించ గల్గడం…

అయ్యో… మాడుతుందండీ!!!” అంటూ వంటగదిలోకి పరుగులు తీసింది లలిత రాణి…

లలిత శేఖర సంభాషణలు - 1

-అరవింద్